Chiranjeevi Guinness Record : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఖాతాలో మరో రికార్డు (Record) చేరింది. సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీనితో చిరంజీవిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) గౌరవించింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇలా సినిమాల్లో ఎక్కువగా డాన్స్ వేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి విన్నర్ గా ఇంకేమైనా రికార్డ్స్ చిరంజీవి క్రియేట్ చేస్తారేమో చూడాలి. ఇక రానున్న రోజుల్లో చిరంజీవి ఖాతాలో ఇంకా ఎన్ని రికార్డ్స్ నమోదు కానున్నాయో వేచి చూడాలి.
Read Also : Pawan Kalyan : చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే..దేశం ఇలాగే ఉండేదా..?