Indra Re Release : ‘ఇంద్ర’ టీంను సత్కరించిన చిరంజీవి

ప్రొడ్యూసర్ అశ్విని దత్, దర్శకుడు జీ. గోపాల్, మరుపురాని డైలాగ్స్ అందించిన పరుచూరి బ్రదర్స్, కధనందించిన చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మకు సత్కారం చేశారు

Published By: HashtagU Telugu Desk
Indra Team

Indra Team

మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ టీంను సత్కారించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (Chiranjeevi Birthday) సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ (Indra ) మూవీ ఆగస్టు 22 న రీరిలీజ్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే. ఈ సందర్బంగా ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

2002లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమ నటనతో మెప్పించారు. అలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇప్పుడు మరోసారి 4కే వెర్షన్ లో రీరిలీజ్ అవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రీ రిలీజ్ అయినా ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. థియేటర్స్ లో అభిమానుల సంబరాల వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటె చిరంజీవి ‘ఇంద్ర’ టీమ్ ను ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.

ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్, దర్శకుడు జీ. గోపాల్, మరుపురాని డైలాగ్స్ అందించిన పరుచూరి బ్రదర్స్, కధనందించిన చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మకు సత్కారం చేశారు. అలాగే చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.

Read Also : Nirmal Benny : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ..ఫేమస్ నటుడు మృతి

  Last Updated: 23 Aug 2024, 10:31 PM IST