Site icon HashtagU Telugu

Chiranjeevi : కృష్ణవంశీ సరదాగా అడిగితే.. చిరంజీవి నిజంగానే కోటి విలువ చేసే బహుమతి ఇచ్చాడు..

Chiranjeevi, Krishna Vamsi, Ram Charan

Chiranjeevi, Krishna Vamsi, Ram Charan

Chiranjeevi : టాలెంట్ తో పైకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. టాలెంట్ ఉన్న వాళ్ళని చిన్న, పెద్ద చూడకుండా ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ ఉంటారు. ఈక్రమంలోనే సినిమా పరిశ్రమలోని చాలామంది ప్రతిభావంతులకు తన వంతు సహాయం అందిస్తూనే, అప్పుడప్పుడు వారి కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలా ఓ సందర్భంలో క్రియేటివ్ డైరెక్టర్ అడిగిన ఓ సరదా కోరికను.. విలువెంత అని చూడకుండా నెరవేర్చారు. ఆ విషయాన్ని ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఈవెంట్ లో కృష్ణవంశీ బయటపెట్టారు.

కృష్ణవంశీ చిరంజీవితో కలిసి సినిమాలు చేయకున్నా, యాడ్ ఫిలిమ్స్ మాత్రం చేసారు. అలా ఓ యాడ్ షూట్ చేస్తున్న సమయంలో.. చిరంజీవి తన దగ్గర ఉన్న ఖరీదైన కారుని వేసుకొచ్చారు. చిరంజీవి దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆ కారుని రంపించుకున్నారట. ఆ కారు పేరు ల్యాండ్ క్రూజర్. దాని విలువ అక్షరాలా కోటి పైనే. కృష్ణవంశీకి ఆ మోడల్ కారులు అంటే చాలా ఇష్టమంట. ఆ ఇష్టంలో ఒకసారి చిరంజీవి దగ్గర కృష్ణవంశీ మాట్లాడుతూ.. “అన్నయ్య నాకు ల్యాండ్ క్రూజర్ కారులంటే చాలా ఇష్టం. ఈ కారు భలే ఉంది. నాకు ఇచ్చే అన్నయ్యా” అని సరదాగా అడిగారట.

అయితే ఆ సరదా మాటల్ని చిరంజీవి సీరియస్ గా తీసుకున్నారు. కరెక్ట్ గా పదిహేను రోజులు తరువాత కృష్ణవంశీకి ఫోన్ చేసి ఇంటికి రమన్నారట. చిరంజీవి ఫోన్ చేసి పిలవడంతో.. కృష్ణవంశీ తన పనులు అన్ని పక్కన పెట్టేసి వెంటనే చిరు ఇంటికి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లిన తరువాత కృష్ణవంశీ చేతులు చిరంజీవి ఆ కారు తాళాలు పెట్టి.. ఇది నీ సొంతం అన్నారట. అయితే బహుమతులు తీసుకోవడం ఇష్టం లేని కృష్ణవంశీ.. ఆ కారుని సున్నితంగా తిరస్కరించారట. అయితే అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ.. ‘నన్ను అన్నయ్య అంటున్నావు కదా, ఇది నేను తమ్ముడికి ఇస్తున్న బహుమతి అని తీసుకో’ అని చెప్పడంతో కాదనలేక కృష్ణవంశీ ఆ కారుని తీసుకున్నారట.

Exit mobile version