Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటున్నా కూడా.. పలు ఈవెంట్స్ కి ముఖ్య అతిథిగా హాజరవుతూ అందర్నీ సంతోష పరుస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ‘తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్’ ఈవెంట్ లో చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. నిన్న (మార్చి 31) హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ని సుమ హోస్ట్ చేసారు. ఇక ఈ వేదిక పై సుమ చేసిన ఓ దొంగతనాన్ని చిరంజీవి బయటపెట్టారు.
అసలు విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్ కి సుమ సూట్ అండ్ ప్యాంటు వేసుకొని స్టైలిష్ గా వచ్చారు. ఇక ఇది గమనించిన చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో వేదిక సుమని ఒక ఆట ఆడుకున్నారు. వేదిక పై సుమని పట్టుకొని, చిరు తన సతీమణి సురేఖకి ఫోన్ చేసినట్లు యాక్ట్ చేసి.. “సురేఖ నా గ్రే సూట్, బ్లాక్ ప్యాంటు ఇంటిలో కనిపించడం లేదు అన్నావు కదా. నాకు ఇక్కడ కనిపించింది. సుమ వేసుకొని ఇక్కడ తిరుగుతుంది. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు తన చేతివాటం చూపించినట్లు ఉంది. మన కష్టజీతం ఎక్కడికి పోదు. మన దగ్గరికే వస్తుంది. సుమ ఇచ్చేస్తుందిలే” అంటూ సరదాగా మాట్లాడి ఈవెంట్ లోని అందర్నీ నవ్వించారు.
Also read : Chiranjeevi : ఇంటిలో సంసారం కూడా చేసుకోనివ్వడం లేదు.. వారిపై చిరు కామెంట్స్..
#Chiranjeevi funny banter with #Suma at the Origin Day event of Telugu Digital Media Federation. pic.twitter.com/ezMM3fACAU
— Gulte (@GulteOfficial) March 31, 2024
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ ఈవెంట్ లో చిరంజీవి, విజయ్ దేవరకొండతో ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో చిరంజీవి తన లైఫ్ ఎదుర్కొన్న సమస్యలు, తన మొదటి ఛాన్స్, తన అవమానాలు గురించి చెప్పుకొచ్చారు. చిరుకి మొదటి అవకాశం సుధాకర్ వల్ల వచ్చిందట. ‘పునాదిరాళ్ళు’ సినిమాలో చిరు చేసిన పాత్ర సుధాకర్ చేయాల్సింది. కానీ సుధాకర్ కి వేరే అవకాశం రావడంతో ఆ పాత్ర చిరుని వరించిందట.