చిరంజీవికి(Chiranjeevi) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరునే స్వయంగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనకి రామ్ చరణ్ (Ram Charan) మాత్రమే కొడుకు కాదు, పవన్ కూడా తనకి కొడుకే అంటూ చిరు చాలా సందర్బాల్లో పేర్కొన్నాడు. ఇక ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. పవన్ ని రాజకీయంగా విమర్శించే వాళ్ళు నా దగ్గరకి వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. పవన్ పై ఆ విమర్శలు భరించలేకే చిరు పొలిటికల్ న్యూస్ చూడడమే మానేశాడట. దీంతోనే తెలుస్తుంది చిరుకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో.
అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. పవన్ కి సంబంధించిన ఒక సినిమా షూటింగ్ ని ఒక అద్దె ఇంటిలో జరుపుతున్నారు. ఆ ఇంటి ఓనర్ ఒక పెద్ద డాక్టర్. లైటింగ్ యూనిట్ వాళ్ళది కరెంటుతో పని కాబట్టి వాళ్ళు ఇంటిలో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. అయితే అలా చెప్పులు వేసుకొని ఇంటిలో తిరుగుతునందుకు ఆ ఇంటి ఓనర్ వాళ్ళ పై అరిచేశాడు. దానిని పవన్ కళ్యాణ్ తప్పుబడుతూ.. డబ్బులు తీసుకునే కదా ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు ఇలా మాట్లాడం తప్పు అని చెప్పాడట. కానీ ఆ వ్యక్తి పవన్ పై కూడా గొడవకు దిగి, తిట్టి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు. పవన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇక ఇదంతా ఎక్కడో మూవీ షూటింగ్ లో ఉన్న చిరంజీవికి తెలిసి వెంటనే ఆ ఇంటి ఓనర్ కి ఫోన్ చేశాడట. అతను కాల్ లిఫ్ట్ చేయగానే చిరు ముందుగా పచ్చి బూతులు తిట్టాడట. అసలు నువ్వు ఎవడ్రా నా తమ్ముడిని తిట్టడానికి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ ఇటీవల ఓ ఈవెంట్ లో చిరంజీవి ఎదురుగా ప్రేక్షకుల అందరికి తెలియజేశాడు. చిరంజీవికి ఆయన్ని ఏమని తిట్టినా కోపం రాకపోవచ్చు గాని, ఆయన తమ్ముళ్ళని అంటే మాత్రం విపరీతమైన కోపం వస్తుందని చెప్పుకొచ్చాడు.
Also Read : Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు.. చాలా బాధ వేసింది..