హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య సెట్స్ నుంచి రామ్ చరణ్ సరదా వీడియోను ఒకటిని షేర్ చేశారు. సెట్స్‌లో రామ్ చరణ్ కోతికి ఆడుతూ, తినిపిస్తున్న దృశ్యాలను వీడియోలు చూడొచ్చు. చరణ్ కోతిని గమనించి, తన చేతులతో దానికి కొన్ని బిస్కెట్లు తినిపించాడు. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు చిరు. కాగా చిరంజీవి, రామ్ చరణ్ నేతృత్వంలోని ఆచార్య ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం తండ్రికొడుకులు ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఈ మూవీలో పూర్తి స్థాయి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆచార్యపై మునుపెన్నడూ లేని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు కలిసి నటించినట్టు తెలుస్తోంది.
https://youtu.be/eS-ScDJRovQ