Site icon HashtagU Telugu

Prabhas Birthday : ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్ – మెగాస్టార్ ‘మెగా’ ట్వీట్

Chiru Prabhas

Chiru Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈరోజు 45 వ ఏటా (Prabhas 45th Birthday) అడుగుపెట్టారు. వయసు 45 కు వచ్చిన ఇంకా 25 ఏళ్ల యువకుడి లా కనిపిస్తూ..అమ్మాయిలతో డార్లింగ్ అనిపిలిచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియా బర్త్ డే విషెష్ లతో ట్రెండింగ్ గా మారింది. అభిమానులే కాదు యావత్ సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మెగా ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.

‘ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్. అతను ప్రేమించే పద్ధతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్. మీకు ఈ ఏడాది మరింత ప్రేమ, కీర్తి, సంతోషం లభించాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేసారు.

అలాగే డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ : అందరి డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్ఫూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్‌ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసారు.

డైరెక్టర్ బాబీ : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. వెండితెరపై మీ అద్భుతాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. ఈ ఏడాది కూడా మీ మ్యాజిక్‌ చూడాలని ఆసక్తిగా ఉన్నాం అంటూ తెలిపారు.

ఆది సాయికుమార్‌ : నాకు ఇష్టమైన నటుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అని చెప్పుకొచ్చాడు.

మరొపక్క జపాన్ అభిమానులు మాత్రం మూడు రోజుల ముందుగానే బర్త్ డే వేడుకలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అక్కడి థియేటర్లలో ‘రాధేశ్యామ్’ సినిమాను రీరిలీజ్ చేశారు. దీంతో అక్కడి థియేటర్లలో అభిమానులంతా చేరుకుని హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ సందడి చేశారు. స్పెషల్ బ్యానర్స్, ప్లకార్డ్స్​ పట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Read Also : Bill Gates – Kamala : కమలకు బిల్‌గేట్స్ రూ.420 కోట్ల భారీ విరాళం