Chiranjeevi Demands: భోళా శంకర్‌ కు ‘చిరంజీవి’ కండీషన్స్

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పాటలు, ట్యూన్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
chiru demands

Bholashankar1

పూర్తిగా రాజకీయాలకు (Politics) దూరమైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే, మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు స్టోరీస్ పైనే ఫోకస్ చేసిన మెగాస్టార్ (Megastar Chiranjeevi) పాటలు (Songs), ట్యూన్స్, అందుకు సంబంధించిన విజువల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది. “వాల్తేరు వీరయ్య”  నుండి “బాస్ పార్టీ” విడుదలైన తర్వాత దేవి శ్రీ ప్రసాద్ విమర్శలను ఎదుర్కొన్నాడు.

“నువ్వు చొక్కా వేసుకో….లుంగీ కట్టుకో” లాంటి లిరిక్స్ పై దారుణంగా ట్రోల్స్ (Trolling) వచ్చాయి. అయినా దేవీ సంగీతం సినిమా బాక్సాఫీస్ విజయానికి కారణంగా నిలిచింది. “వాల్తేరు వీరయ్య” సూపర్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాలోని “డోంట్ స్టాప్ డ్యాన్స్…పూనకాలు లోడింగ్” “నువ్వు శ్రీదేవి ఐతే నేను చిరంజీవి అవుతా” అనే రెండు పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఈ పాటలకు ఆయన ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు ఫిదా అయ్యారు.

ఫలితాన్ని చూసిన మెగాస్టార్, తమ సినిమా భోళా శంకర్ (Bhola Shankar) కోసం ఆకర్షణీయమైన ట్యూన్‌లు, ఆకట్టుకునే విజువల్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టమని దర్శకుడు మెహర్ రమేష్‌కి చెప్పినట్లు సమాచారం. చిరంజీవి రాబోయే చిత్రం భోళా శంకర్‌కి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. మెహర్ రమేష్ కొన్ని పెప్పీ ట్యూన్‌లను రూపొందించడానికి మహతితో కలిసి పని చేయాల్సి ఉంది. వాటిని కలర్‌ఫుల్‌ నేపథ్యంలో తెరకెక్కించాలని రమేష్‌ (Ramesh) ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది.

Also Read: BJP Dilemma: కేసీఆర్ ‘ఖమ్మం’ సభ సక్సెస్.. బీజేపీకి దడ!

  Last Updated: 19 Jan 2023, 12:54 PM IST