Site icon HashtagU Telugu

Chiranjeevi : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi Comments Politi

Chiranjeevi Comments Politi

దేశ వ్యాప్తంగా ఎన్నికల (Elections) నగారా మోగింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్ జరుగగా..మరికొన్ని రాష్ట్రంలో విడతలవారీగా పోలింగ్ జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీ(AP)లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫై అంత ఫోకస్ చేస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ , రాజకీయ నేతలు సైతం ఈసారి గెలుపు ఎవర్ని అనేదాని గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తన రాజకీయ రంగం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా పేరు తెచ్చుకున్న చిరంజీవి..రాజకీయాల్లో మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు ఏదో చేద్దామని చెప్పి రాజకీయ ప్రవేశం చేసి..పదేళ్లు తిరగక ముందే పార్టీని కాంగ్రెస్ లో కలిపి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి ఆహా(Aha) ఓటీటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రజలకు ఎంతో సేవ చేయాలనీ రాజకీయాల్లోకి వెళ్ళాను. కానీ రాజకీయాల్లోకి వెళ్లి పెద్ద పొరపాటు చేసానని ఆ తర్వాత తెలిసింది. పాలిటిక్స్ లో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేద్దామని వెళ్ళాను కానీ నేటి పాలిటిక్స్ లో నాలాంటి వాడు అనర్హుడు అనేది వాస్తవం. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం రాజకీయ ద్వారానే చేయాలనీ ఏమి లేదు. తమ తమ వృత్తిని కొనసాగిస్తూనే ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పుకొచ్చారు. ఇకపై బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను, ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తాను అని స్పష్టం చేసారు.

Read Also : Owaisi : బోగ‌స్ ఓట్ల ఆరోప‌ణ‌పై స్పందించిన అస‌దుద్దీన్ ఓవైసీ