Chiranjeevi Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి సందీప్ వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాకు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. యానిమల్ సినిమా తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమాగా స్పిరిట్ మీద భారీ హైప్ ఉంది. ఐతే ఈ సినిమా లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట. ప్రభాస్ తో ఆల్రెడీ నయనతార యోగి సినిమాలో జత కట్టింది. ఇదిలాఉంటే ఈ సినిమాలో ఒక కెమియో రోల్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారని లేటెస్ట్ టాక్. మెగాస్టార్ Chiranneevi అంటే సందీప్ వంగా (Sandeep Vanga)కి విపరీతమైన అభిమానం. ఆయన ఫ్యాన్ గా ఎప్పుడు చిరు గురించి చెబుతూనే ఉంటాడు సందీప్ వంగ.
పవర్ ఫుల్ క్యామియో..
ప్రభాస్ (Prabhas) సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో ఉంటుందని దాని కోసం చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం స్పిరిట్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ చిరంజీవి ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం అటు రెబల్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కి కూడా పండగ అని చెప్పొచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2, ఫౌజి ఇలా తన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Surendar Reddy : పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టేసి ఇంకో సినిమాకు రెడీ అవుతున్న డైరెక్టర్..