Site icon HashtagU Telugu

Chiranjeevi: లగ్జరీ కార్ కొనుగోలు చేసిన చిరంజీవి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

Chiranjeevi

Chiranjeevi

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ ప్రస్తుతం తదుపరిచిన భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా 50% వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు మెగాస్టార్. ఇక అదే ఊపుతో మరికొన్ని ప్రాజెక్టులకు కూడా సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.. చిరంజీవి తదిపరి సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. చాలామంది ఆ కారు ధర తెలిసి షాక్ అవుతున్నారు. టయోటో కంపెనీకి సంబంధించిన కారుని కొనుగోలు చేశాడు. ఈ కారు ధర విషయానికి వస్తే రూ.1.9 కోట్లు అని తెలుస్తోంది.

బ్లాక్ కలర్ లో ఉన్న ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం తాజాగా చిరంజీవి ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వెళ్ళగా కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మెగాస్టార్‌ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్‌ను కేటాయించారు. రూ.4.70 లక్షలు పెట్టి TS09GB1111 నెంబర్‌ కైవసం చేసుకున్నాడు చిరంజీవి. ఈ మేరకు ఆర్టీఏ ఆఫీసులో ఫోటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే చిరంజీవి కొనుగోలు చేసిన ఆ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే.. వెల్‌ఫైర్‌ వాహనం విషయానికి వస్తే ఆ కారులో మూడు వరుసలు ఉంటాయి. ఏడు మంది ఎంచక్కా కూర్చుని ప్రయాణించవచ్చు. భద్రత కోసం ఏడు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం విశేషం. ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్స్‌ మరో ప్రత్యేకత. ట్విన్‌ సన్‌రూఫ్‌, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్స్‌ వంటి మరిన్ని స్పెషాలిటీస్‌ ఈ వాహనం సొంతం అని చెప్పవచ్చు.