Site icon HashtagU Telugu

Chiranjeevi : వెకేషన్ నుంచి వచ్చేసిన చిరంజీవి.. నెక్స్ట్ ఎటు.. జనసేన..? విశ్వంభర..?

Chiranjeevi Back From His Vacation And Now Which Side Is Going Janasena Or Vishwambhara

Chiranjeevi Back From His Vacation And Now Which Side Is Going Janasena Or Vishwambhara

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటూ వస్తున్నారు. అయితే చిరంజీవి ఇటీవల ఒక చిన్న గ్యాప్ ఇచ్చి.. తన సతీమణి సురేఖని హాలిడే వెకేషన్ కి తీసుకు వెళ్లారు. తాజాగా చిరంజీవి ఆ వెకేషన్ ని ముగించుకొని మళ్ళీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. అయితే ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ స్టెప్ ఏంటని అందరిలో ఆసక్తి నెలకుంది.

గత కొన్ని రోజులుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీని పై మెగా బ్రదర్ నాగబాబు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. చిరంజీవి వస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదని చెప్పి.. చిరు ప్రచారం పై సస్పెన్స్ ని క్రియేట్ చేసారు. ఇక ఈ సస్పెన్స్ మధ్య చిరంజీవి వెకేషన్ కి వెళ్లడంతో.. ప్రచారానికి రావడం కష్టమే అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు తిరిగి వచ్చేయడంతో చిరంజీవి.. నెక్స్ట్ స్టెప్ ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది. జనసేన కోసం ప్రచారంలోకి దిగుతారా..? లేదా విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టి తన సినిమా షూటింగ్ ని చేసుకుంటారా..? అనేది ప్రశ్నగా మారింది. మరి ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే.. ఒకటిరెండు రోజులు వేచి చూడాల్సిందే. కాగా పవన్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, సాయి దుర్గ తేజ్ రంగంలోకి దిగారు.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. జూన్, జులై నాటికీ ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తీ చేయనున్నారట. సినిమాలో చాలా వరకు VFX వర్క్ ఉండడంతో.. దాదాపు ఐదారు నెలలు ఆ వర్క్ పైనే మూవీ టీం పని చేయనుందట. మూవీలో విఎఫ్ఎక్స్ మెయిన్ హైలైట్ ఉండబోతున్నాయని సమాచారం. దీంతో యూవీ నిర్మాణ సంస్థ బెటర్ అవుట్ పుట్ కోసం భారీగానే ఖర్చు చేస్తుంది.