Site icon HashtagU Telugu

NTR-Chiranjeevi : ఎన్టీఆర్ కొడుకుగా చిరంజీవి..ఏ చిత్రంలో అనుకున్నారో తెలుసా..?

Ntr Son Chiru

Ntr Son Chiru

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) సినీ ప్రస్థానం గురించి కొత్తగా..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ చాలామంది మాత్రం ఎన్టీఆర్ లాగానే దేవుడు ఉంటాడు కావొచ్చు అని అనుకునే స్థాయిలో ఆయన తన నటనతో…రూపంతో కట్టిపడేసారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కొత్త మార్పు తీసుకొచ్చి అందరికి అన్న అనిపించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తో ఎంతోమంది..ఎన్నో సినిమాల్లో నటించారు. చివరగా మోహన్ బాబు (Mohan Babu) కూడా ఎన్టీఆర్ చివరి చిత్రంలో నటించి అదృష్టవంతుడయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అదృష్టం మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కి కూడా వచ్చిందట..అది కూడా ఎన్టీఆర్ కు కొడుకు గా నటించే ఛాన్స్ వచ్చిందట. కాకపోతే డేట్స్ కుదరక ఆ ఛాన్స్ మిస్ అయ్యింది లేకపోతే చిరంజీవి కొడుకు గా నటిస్తే ఆ లెక్క మరోలా ఉండేది. ఎన్టీఆర్ కథానాయకుడిగా 1981 అక్టోబర్ 7 న విడుదలైన మూవీ కొండవీటి సింహం (Kondaveeti Simham). ఈ మూవీలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని ఈ చిత్రం బ్రేక్ చేసింది. అలాంటి గొప్ప చిత్రం లో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా రాము గా డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ పోషించాడు.

రంజిత్ కుమార్ కి ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు ఉంటే రంజిత్ కుమార్ ప్రాణాలకి ప్రమాదమని జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మావయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారతాడు. ఈ క్యారక్టర్ కే చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు మొదట చిరంజీవిని అనుకున్నాడు. నిర్మాతలు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పడంతో రాఘవేంద్రరావు చిరంజీవిని ఎన్టీఆర్ రెండో కొడుకు పాత్రలో నటింప చెయ్యాలని అనుకున్నాడు. కానీ చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారక్టర్ మోహన్ బాబుకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.ఈ విధంగా డేట్స్ కనుక అడ్డుపడకపోయి ఉంటే చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా నటించేవాడు. అంతకు ముందు చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి తిరుగులేని మనిషి సినిమాలో నటించాడు.

Read Also : Ambati Arjun : అర్జున్ అంబటి కోరిక తీరింది..బంగారుతల్లి అడుగుపెట్టింది