Annayya Movie : అన్నయ్య సినిమాలో చిరుకి తమ్ముళ్లుగా ఆ హీరోలు నటించాల్సింది.. కానీ..!

అన్నయ్య మూవీలో అన్నదమ్ముల మధ్య బంధాన్ని చూపించాడు. మూవీ మొదలు నుంచి ఎండింగ్ వరకు చిరంజీవితో పాటు తమ్ముళ్లు క్యారెక్టర్స్ కూడా దాదాపు స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటాయి.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 07:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 1999లో ‘స్నేహం కోసం’, ‘ఇద్దరు మిత్రులు’ అంటూ బ్యాక్ టు బ్యాక్ ఫ్రెండ్‌షిప్ పై తెరకెక్కిన సినిమాల్లో నటించాడు. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఆ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని మెప్పించిన కమర్షియల్ సక్సెస్ అవ్వలేకపోయాయి. చిరు నుంచి ఒక మాస్ కమ్‌బ్యాక్ ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన సినిమా ‘అన్నయ్య'(Annayya). ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గతంలో చిరు ప్లాప్‌ల్లో ఉన్న సమయంలో ఈ దర్శకుడే ‘హిట్లర్’ వంటి సూపర్ హిట్టుని అందించాడు. దీంతో ఈసారి కూడా హిట్ ఖాయం అని ఫ్యాన్స్ ముందు నుంచే భావించారు.

ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక మూవీలోని టైటిల్ సాంగ్ అయితే చిరంజీవి మరియు తన అభిమానుల మధ్య బాండింగ్ ని చెబుతూ చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హిట్లర్ లో అన్నాచెల్లెల బంధం చూపించిన దర్శకుడు. ఈ మూవీలో అన్నదమ్ముల మధ్య బంధాన్ని చూపించాడు. మూవీ మొదలు నుంచి ఎండింగ్ వరకు చిరంజీవితో పాటు తమ్ముళ్లు క్యారెక్టర్స్ కూడా దాదాపు స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటాయి. దీంతో తమ్ముళ్ల పాత్రలకు కూడా హీరోలనే తీసుకుందామని దర్శకుడు భావించాడట. అందుకోసం శ్రీకాంత్(Srikanth) అండ్ జెడి చక్రవర్తి(JD Chakravarthy)ని చిరంజీవికి తమ్ముళ్లుగా అనుకున్నారట.

అయితే శ్రీకాంత్ ఆ సమయంలో హీరోగా పీక్ స్టేజిలో ఉన్నాడు. సంవత్సరానికి సుమారు 6 సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్ కి కుదరకపోవడంతో జెడి చక్రవర్తి ఆలోచన కూడా పక్కన పెట్టేసి, అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న రవితేజ, వెంకట్ ని తీసుకున్నారు. సినిమాలో చిరు, రవితేజ(Raviteja), వెంకట్(Venkat) మధ్య వచ్చే సీన్స్ అందర్నీ ఆకట్టుకొని మూవీని సూపర్ హిట్ చేశాయి. ఇక ఈ సినిమాలో సౌందర్య(Soundarya) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

 

Also Read : Nani: నానికి బంపరాఫర్, రజనీ మూవీలో ప్రత్యేక పాత్ర ఆఫర్!