Chiranjeevi : విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ అనిల్ రావిపూడి. ఆల్రెడీ వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేసిన అనిల్ సంకాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. వెంకటేష్ కూడా ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం ఈమధ్య కాలం లో జరగలేదు. అందుకే వెంకీ కూడా ఈ సక్సెస్ తో ఫుల్ జోష్ గా ఉన్నాడు.
ఐతే అనిల్ రావిపూడి ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో దాదాపు ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ చేశాడు. చిరంజీవి ఇమేజ్ ని వాడుకుంటూ తన మార్క్ ఎంటర్టైనర్ సినిమా చేస్తానని అంటున్నాడు అనిల్ రావిపూడి. ఐతే చిరంజీవి విశ్వంభర రిలీజ్ అయ్యాక చిరు అనిల్ తో సినిమా చేసే ఛాన్స్ లేదు.
వెంకటేష్ తో 73 రోజుల్లో సినిమా తీస్తాడేమో కానీ చిరుతో కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అందుకు తగినట్టుగా ప్రిపరేషన్స్ ఉంటాయి. చిరుతో సినిమాను కూడా 2026 సంక్రాంతికి తెచ్చే ప్లానింగ్ తో ఉన్నాడు అనిల్ రావిపూడి. నిర్మాత కచ్చితంగా దిల్ రాజు గారే అవుతారు. ఐతే షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి చిరు సినిమా నిర్మించనున్నారు.
చిరు అనిల్ ఈ కాంబో కూడా ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. మరి చిరంజీవిని పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నా, తరహాలోనే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.