Site icon HashtagU Telugu

Chiranjeevi: మెగాస్టార్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అలాంటి క్యారెక్టర్ లో నటిస్తోందా?

Chiranjeevi

Chiranjeevi

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు మెగాస్టార్. అందులో భాగంగానే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో చాలా సినిమాలను లైన్ లో పెట్టారు మెగాస్టార్.

ముఖ్యంగా యంగ్​ డైరెక్టర్స్​ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌ లో ఒకప్పుడు అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్‌ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి హీరో నాని ట్విటర్‌ వేదికగా గతంలో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పోస్టర్‌ ని కూడా ఆయన షేర్ చేశారు.

చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ ను విడుదల చేసి ఫ్యాన్స్‌ లో హైప్‌ ను పైగా పెంచేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్‌ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగారాణీ ముఖర్జీ మంచి సెలక్షన్‌ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్‌ సర్కిల్‌లో ట్రెండ్‌ అవుతోంది.