మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదూరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆచార్య మూవీ టీం ట్రైలర్ ను విడుదల చేసింది. తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రత్యేక పాత్రలో చరణ్ సిద్ధాగా ఆకట్టుకున్నాడు. అయితే ఆచార్య కంటే ముందు, చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి 2009 బ్లాక్ బస్టర్ మగధీరలో కలిసి నటించారు. ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ.. నా తండ్రితో కలిసి నటించడం గొప్ప గౌవరంగా భావిస్తున్నా. నాది కూడా పూర్తిస్థాయి పాత్ర. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ తెలిపారు.
‘దివ్య వనమొకవైపు.. తీర్థ జలమొకవైపు.. నడుమ పాతఘట్టం’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అంతా సౌమ్యులు అంతా పూజలు చేసుకుంటూ కష్టాలు వస్తే.. అమ్మొరుపై భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు.. ఆపదొస్తే ఆ అమ్మొరే మాలో ఆవహించి ముందుకు పంపుతది. ధర్మ స్థలి అధర్మ స్థలి ఎలా అవుతుంది. అంటూ తమ ఊరు గురించి రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ ట్రైలర్ విడుదల కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ 2 కూడా త్వరలో రాబోతోంది.