Site icon HashtagU Telugu

Chiranjeevi and Nag: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో చిరు, నాగ్ భేటీ!

Anurag

Anurag

కేంద్ర సమాచార & క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ (Anurag Thakur) టాలీవుడ్ సీనియర్ హీరోలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. చిరంజీవి, నాగార్జునలు (Chiranjeevi and Nag) శాలువాతో కేంద్రంమంత్రిని సత్కరించారు. చిరు, నాగ్ లు గణేష్ విగ్రహాన్ని బహూకరించారు. గత రెండు రోజులుగా అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. వివిధ క్రీడలు, బిజెపికి సంబంధించిన వరుస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఈ ముగ్గురి భేటీ (Chiranjeevi and Nag)లో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

చిరు తన ట్విట్టర్‌లో మంత్రిని కలిసిన ఫొటోలను షేర్ చేశారు. “నిన్న మీరు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు anuragthakur గారికి ధన్యవాదాలు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గురించి, సాధిస్తున్న పురోగతి గురించి మా సోదరుడు nagarjunaతో కలిసి  సంతోషకరమైన చర్చ జరిగింది. ఇది చాలా నచ్చింది” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రిని కలిసిన చిరు, నాగ్ ఫొటోలు (Chiranjeevi and Nag) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రిని కలిసినవారిలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

Also Read: D. Srinivas: డి. శ్రీనివాస్ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!