Simran and Shruti Haasan: అప్పుడు సిమ్రాన్, ఇప్పుడు శృతి హాసన్.. ఒకే హీరోయిన్ తో చిరు, బాలయ్య రొమాన్స్!

90వ దశకంలో హీరోల సంఖ్య ఎక్కువే ఉన్నప్పటికీ, వారికి సరిపోయే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ. అందుకే దాదాపు స్టార్ హీరోలందరూ

  • Written By:
  • Updated On - November 30, 2022 / 04:58 PM IST

90వ దశకంలో హీరోల సంఖ్య ఎక్కువే ఉన్నప్పటికీ, వారికి సరిపోయే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ. అందుకే దాదాపు స్టార్ హీరోలందరూ ఫలానా సీజన్‌లో ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేసేవారు. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలు క్లాష్ కావాల్సి వస్తే.. వారం లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ తీసుకునేవారు చిత్ర నిర్మాతలు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరు, బాలయ్యల సినిమాలో  హీరోయిన్లు ఒకరే కావడం విశేషం. 2001లో మెగాస్టార్ మృగరాజు, బాలయ్య నరసింహ నాయుడు సంక్రాంతి  రేసులో పోటీలో నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. బాలయ్య సినిమాలో సూపర్ స్పైసీగా కనిపించినా సిమ్రాన్, చిరు సినిమాలో కాస్త హోమ్లీగా కనిపించింది. నరసింహ నాయుడు విజయంలో ఆమెకు గ్లామర్ పాత్రలు కూడా క్యూ కట్టాయి.

మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరు, బాలయ్య ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఆసక్తిని రేపుతోంది. అప్పుడు సిమ్రాన్ వంతు అయితే, ఇప్పుడు శృతి హాసన్ వంతు వచ్చింది. ఆమె వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇద్దరికీ లీడింగ్ లేడీ. అయితే ఆ సమయంలో సిమ్రాన్ స్టార్ హీరోయిన్. కానీ ప్రస్తుతం శృతి హాసన్ కు ఆ హోదా లేదు.  డబుల్ అప్పియరెన్స్‌లతో ఈ రెండూ బ్లాక్‌బస్టర్‌  సాధిస్తే, ఖచ్చితంగా శృతి కెరీర్ మలుపు తిరుగుతుంది అని చెప్పక తప్పదు.