Chiranjeevi : సావిత్రి ముందు డాన్స్ వేస్తూ పడిపోయిన చిరు.. ఆ తరువాత ఏం జరిగింది..!

'పునాది రాళ్లు' షూటింగ్ సమయంలో సావిత్రి ముందు డాన్స్ వేస్తూ జారీ పడిపోయిన చిరంజీవి. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Shares A Memory With Mahanati Savitri From Punadhirallu Movie Sets

Chiranjeevi Shares A Memory With Mahanati Savitri From Punadhirallu Movie Sets

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అలనాటి గొప్ప తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రిలతో కూడా కలిసి నటించారు. ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ తో ఒక్కో సినిమా చేసిన చిరంజీవి.. సావిత్రమ్మతో కలిసి రెండు సినిమాల్లో నటించారు. చిరంజీవి నటించిన మొదటి సినిమా ‘పునాది రాళ్లు’లోనే సావిత్రితో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ తరువాత ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో ఆమెకు కొడుకుగా నటించారు.

కాగా ‘పునాది రాళ్లు’ షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటనని.. రీసెంట్ గా జరిగిన మహానటి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ లో చిరంజీవి బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి నుంచి సావిత్రిని అభిమానిస్తూ పెరిగిన చిరంజీవి.. ఆమెతో నటించే ఛాన్స్ రాగానే ఆనందంతో ఉప్పొంగిపోయారట. ఆ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో.. వర్షం వచ్చి షూటింగ్ నిలిచిపోయిందట.

ఇక ఆ సమయంలో చిరంజీవిని డాన్స్ వేయమని సావిత్రి అడిగారట. తన అభిమాన నటి అడగడం చిరంజీవి చేయకపోవడం జరుగుతుందా. చిరంజీవి వెంటనే తన దగ్గర ఉన్న టేప్ రికార్డర్ తీసి ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టి డాన్స్ వేయడం స్టార్ట్ చేసారు. అయితే మధ్యలో చిరంజీవి కాలు జారిపడిపోయారట. కానీ చిరంజీవి దానిని కూడా కవర్ చేస్తూ.. పడుకొని స్టెప్పులు వేసేశారట.

ఇక అది చూసిన సావిత్రి.. చిరంజీవి ఎంతో మెచ్చుకున్నారట. నువ్వు మంచి నటుడు అవుతావు అని చెప్పి అభినదించారట. కాగా చిరంజీవి ఇప్పటికి ఆమె సినిమాలు, పాటలు చూస్తూనే వస్తారట. అంతేకాదు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తారట. ఈ విషయానికి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సంజయ్ కిషోర్ రాసిన సావిత్రి క్లాసిక్స్ బుక్ ని చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ ఈవెంట్ కి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, జయసుధ, మురళీమోహన్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు హాజరయ్యారు.

Also read : Thalapathy Vijay : తన కొత్త సినిమాకి విజయ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా.. దానితో హనుమాన్ మూవీని..

  Last Updated: 03 Apr 2024, 12:32 PM IST