Chinmayi : చిన్మయి మార్ఫింగ్ ఫోటో వైరల్..

Chinmayi : ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళల హక్కులు, భద్రతకు సంబంధించిన విషయాలపై ఆమె గట్టిగా తన వాయిస్‌ను వినిపించడం

Published By: HashtagU Telugu Desk
Chinmayi Morphing Photo

Chinmayi Morphing Photo

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళల హక్కులు, భద్రతకు సంబంధించిన విషయాలపై ఆమె గట్టిగా తన వాయిస్‌ను వినిపించడం వలన కొందరు ఆమెను ‘ఫెమినిస్ట్’ అని ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోలింగ్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, ఎప్పటికప్పుడు ఘాటైన కౌంటర్లతో జవాబిస్తూ చిన్మయి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా తన మార్ఫింగ్ ఫోటోలపై ఆమె తీవ్రంగా స్పందించి, వాటిని షేర్ చేసిన అకౌంట్ల స్క్రీన్‌షాట్‌లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రకటించారు. తనను మరియు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు డబ్బు తీసుకుని మరీ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు.

చిన్మయి మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు, తనపై జరుగుతున్న వేధింపుల గురించి వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. గత 8 నుంచి 10 వారాలుగా కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని తన కుటుంబాన్ని ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, కానీ డబ్బు తీసుకుని ఈ పని చేస్తున్న వ్యక్తుల నుండి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను” అని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత సమస్యగా కాకుండా, సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్న ప్రతి అమ్మాయికి సంబంధించిన అంశంగా ఆమె ఈ విషయాన్ని హైలైట్ చేశారు.

CM Revanth : నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ

నిజానికి ఇది చిన్మయికి కొత్త కాదు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రిలీజ్ సమయంలో ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రంపై చేసిన పాత వ్యాఖ్యలను బయటకు తీసి, ఈ దంపతులను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. మంగళసూత్రం మహిళలకు భద్రత కల్పించలేదని, ఈ సమాజంలో స్త్రీలకు ఏ దశలోనూ భద్రత లేదంటూ చిన్మయి తన భర్త వ్యాఖ్యలకు మద్దతుగా పోస్ట్ పెట్టడంతో ట్రోలింగ్ మరింత పెరిగింది. ట్రోలర్లు మరింత దిగజారి, “చిన్మయి లాంటి వారికి పిల్లలు పుట్టకూడదని, పుట్టినా వెంటనే చనిపోవాలని” అత్యంత అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఈ దారుణమైన దూషణలపై అప్పట్లో ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంలోనూ అమ్మాయిలు భయపడకుండా, కుటుంబ సభ్యులకు తెలియజేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.

  Last Updated: 11 Dec 2025, 09:50 AM IST