టాలీవుడ్ డ్యాన్స్ ప్రపంచంలో హుక్ స్టెప్స్ అంటేనే చిరంజీవి గుర్తుకు వస్తారు. ‘హిట్లర్’లోని స్టెప్పుల నుంచి ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వరకు ప్రతి పాటలో ఆయన సృష్టించిన డ్యాన్స్ ట్రెండ్స్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అదే రక్తంలో పుట్టిన రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని మరింత మెరుగుపరుస్తున్నారు. ప్రతి సినిమాలో కొత్త ఎనర్జీ, ప్రత్యేకమైన హుక్ స్టెప్‌తో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ‘పెద్ది’ మూవీ లోని ‘చికిరి చికిరి’* సాంగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కొండల్లో మాస్ లుక్‌తో చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం
సాధారణ షర్ట్‌లో హీరోయిన్‌ను ‘చికిరి’ అని పిలుచుకుంటూ చరణ్ చేసిన ఆ సిగ్నేచర్ స్టెప్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. నోట్లో బీడీతో బ్యాట్ పట్టుకుని, ‘ఆ చంద్రుల్లో ముక్క, జారిందే నీ నక్క… నా చికిరి చికిరి’ అంటూ చరణ్ వేసిన స్టెప్పులు మరో లెవల్‌లో ఉన్నాయి. ముందుగా విడుదల చేసిన గ్లింప్స్‌లో చరణ్ భూమిపై బ్యాట్ బాదిన షాట్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు అదే ఫ్రేమ్ ఆధారంగా వచ్చిన హుక్ స్టెప్ ఫుల్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మోహిత్ చౌహాన్ వాయిస్, బాలాజీ రాసిన లిరిక్స్ కలిసి విజువల్, మ్యూజిక్ ఫెస్టివల్‌లా అనిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌లో మాసీ లుక్‌తో అలరించనున్నారు.
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యం, ఉత్తరాంధ్ర వాతావరణంలో సాగే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘చికిరి చికిరి’ పాటతో చరణ్ మరోసారి మెగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
