Chhaava : తెలుగు లో ‘ఛావా ‘..?

Chhaava : ఇప్ప‌టికే రూ.370 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం రూ.400 కోట్ల మార్క్‌కి దూసుకెళుతుంది

Published By: HashtagU Telugu Desk
Chhaava Movie Telugu Versio

Chhaava Movie Telugu Versio

‘ఛావా’ ..‘ఛావా’ ..‘ఛావా’ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)హీరోగా నటించగా, ఈ సినిమాకు ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్(Lakshman Utekar) ద‌ర్శ‌క‌త్వం వహించారు. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకం పై దినేశ్‌ విజన్ నిర్మించాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్ప‌టికే రూ.370 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం రూ.400 కోట్ల మార్క్‌కి దూసుకెళుతుంది. అయితే ఈ సినిమా ఒక హిందీలోనే విడుద‌ల కావ‌డంతో వేరే భాష‌లో చూద్దామనుకున్న ప్రేక్ష‌కుల‌కు నిరాశ ఎదురైన విష‌యం తెలిసిందే.

ELECRAMA : విద్యుత్తు పరిశ్రమ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మంత్రి పీయుష్ గోయల్

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ భాషలో చూడాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు లో ‘ఛావా’ ను డబ్బింగ్ చేసేందుకు గీత ఆర్ట్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో మలయాళ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’ తెలుగు డబ్బింగ్‌ను విడుదల చేసిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు ‘ఛావా’ తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘సైరా’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ లాంటి పలు హిస్టారికల్ సినిమాలు మంచి విజయాన్ని సాధించినప్పటికీ, విపరీతమైన వసూళ్లు రాబట్టలేకపోయాయి. తెలుగు వీరుల గాథలు అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి అంచనాలకు తగ్గ స్పందన రాలేదు.

Mahakumbh: మ‌హా కుంభ‌మేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భ‌క్తులు!

అలాంటప్పుడు ఒక మరాఠా వీరుడి కథ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ‘ఛావా’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఈ సినిమాకు సంబంధించిన రూమర్లు మాత్రం ఆగడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. మరోవైపు హీరోయిన్ రష్మిక మందన్న స్వంతంగా తన పాత్రకు డబ్బింగ్ చెబుతుందా? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తలన్నిటికి సమాధానం రావాలంటే త్వరగా మేకర్స్ స్పందించాల్సి ఉంది.

  Last Updated: 26 Feb 2025, 08:51 PM IST