యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) ఇటీవల గంజాయితో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అతని అన్న సంపత్(Sampath Vinay) ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇంకో పెళ్ళికి సిద్దమవ్వడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో షణ్ముఖ్ అన్న సంపత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయమై వెళ్ళినప్పుడే అన్నదమ్ములు ఇద్దరూ గంజాయి సేవిస్తూ దొరికిపోయారు.
అయితే తాజాగా షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై మరో కేసు నమోదు అయినట్టు సమాచారం. సంపత్ తో పాటు MBA చదివిన ఓ అమ్మాయి వద్ద బిజినెస్ పేరుతో 20 లక్షలు తీసుకొని మోసం చేసాడని, డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని కేసు నమోదు చేసింది ఆ యువతి. దీంతో మరోసారి సంపత్ వైరల్ అవుతున్నాడు. ఇంకెన్ని మోసాలు చేసాడో అని చర్చగా మారింది. అయితే షణ్ముఖ్ మాత్రం ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చినట్టు సమాచారం.
గతంలో కూడా షణ్ముఖ్ ఓ హిట్ & రన్ కేసులో పట్టుబడ్డాడు. ఇప్పుడు ఇలా గంజాయి కేసులో పట్టుబడటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే ఈ కేసులపై ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ ఎవ్వరూ బయటకి వచ్చి మాట్లాడలేదు.
Also Read : Priyamani : ఖరీదైన బెంజ్ కారు కొన్న ప్రియమణి.. భర్తతో కలిసి..