Site icon HashtagU Telugu

Charmy Kaur: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన ఛార్మి.. నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నానంటూ?

Mixcollage 17 Feb 2024 10 05 Am 9694

Mixcollage 17 Feb 2024 10 05 Am 9694

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట 2001లో విడుదల అయిన నీతోడు కావాలి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు. ఆపై 2004 లో నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే పేరుకు భక్తి చిత్రమే అయినప్పటికీ ఈ సినిమాలో ఛార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. చాలా సినిమాల్లో నటించా ఛార్మికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి అనే సినిమాలో వేసి పాత్రలో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే చార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్ తో కలిసి ఆమె కొన్ని సినిమాలను నిర్మించింది. ఇకపోతే ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఛార్మి ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెంథిల్ సతీమణి రూహి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు.

సెంథిల్ సతీమణి మరణ వార్త విని సినీ లోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. చాలా మంది సినీ సెలబ్రెటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలా మంది సెలబ్రెటీలకు రూహి యోగా నేర్పించారు. దాంతో ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులయ్యారు. వారిలో ఛార్మి ఒకరు. ఇక ఇప్పుడు రూహి మరణ వార్త విని ఛార్మి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. నీ గురించి ఇలా నేను పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. మై డియర్ రూహి.. నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను.. నాకు మాటలు కూడా రావడం లేదు.. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను.. మనం చివరగా కూడా ఎంతో సరదాగా, నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.. మనది 18 ఏళ్ల బంధం.. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఎమోషనల్ అయ్యారు ఛార్మి. ఈ సందర్భంగా ఛార్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version