Charlie In Bigg Boss: బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈ షో ఓ ఎమోషన్. బిగ్ బాస్ ఎన్ని టాస్క్ లు చేసినా స్టార్ట్ అవ్వగానే టీవీకి అతుక్కుపోతుంటారు. అంతలా ఈ షోకి కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఏడో సీజన్ లో దూసుకుపోతోంది. మలయాళంలో ఐదో సీజన్ ఇటీవలే పూర్తయింది. తమిళంలో కూడా ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. కన్నడలో అక్టోబర్ 8 నుంచి పదో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి హౌస్ లోకి 17 మంది కంటెస్టెంట్లు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ టీమ్ హౌస్ లోకి వచ్చే మొదటి కంటెస్టెంట్ ఎవరనే విషయాన్ని ముందుగానే అధికారికంగా ప్రకటించింది. ఆ కంటెస్టెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన చార్లీ కావడం విశేషం. చార్లీ సినిమాతో ఇంప్రెస్ చేసిన చార్లీ అనే కుక్క షోలో ఎంట్రీ ఇస్తోంది. చార్లీ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఎంత ఏడిపించాడో అందరికీ తెలిసిందే. తన చిలిపి చేష్టలతో హీరోపై విపరీతమైన ప్రేమను కురిపించిన ఈ మూగజీవి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఛార్లీ షోకి రావడంలో ప్రత్యేకత ఏమైనా ఉందా? అని సోషల్ మీడియా చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు హౌస్‌కి డాగ్స్ ని పంపలేదు. తొలిసారిగా చార్లీ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చార్లీకి అభినందనలు తెలుపుతున్నారు. టీఆర్పీలు రాబట్టేందుకు యాజమాన్యం ఇలా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. మరి చార్లీ.. బిగ్ బాస్ కన్నడ సీజన్ 10 ప్రారంభం రోజున అతిథిగా హౌస్‌లోకి ప్రవేశిస్తాడా? లేక కంటెస్టెంట్ గా హౌస్ లో ఉంటాడా? బిగ్ బాస్ అసలు ప్లాన్ ఏంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: TTD Electric Bus Thefted : తిరుమల శ్రీవారి బస్సు చోరీ..!