Site icon HashtagU Telugu

Charan & Princess KlinKaara : కూతురి తో వైజాగ్ బీచ్‌లో సందడి చేసిన రామ్ చరణ్..

Charan Upasana Vizag

Charan Upasana Vizag

చరణ్ (Ram Charan) ఓ పక్క హీరోగా తన కెరియర్ ను కొనసాగిస్తూనే..ఓ తండ్రి గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ..ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్..శంకర్ (Director Shankar) డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ షూటింగ్ కొద్దీ రోజులుగా RK బీచ్ లో కొనసాగుతూ వస్తుంది. దీంతో బీచ్ అంత మెగా అభిమానుల సంద్రంగా మారింది. రామ్ చరణ్ ను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి అభిమానులు తరలివస్తున్నారు. ఈరోజుతో ఇక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ నెల 21 నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కాబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిఇలా ఉంటే..వైజాగ్ కు చరణ్ మాత్రమే కాదు ఆయన సతీమణి ఉపాసన (Upasana) కూడా వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసేసరికి ఉపాసన కూడా వచ్చిందా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఉపాసన పోస్టులో చేసిన దాంట్లో.. రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకార (KlinKaara )తో కలిసి వైజాగ్ బీచ్‌ (RK Beach)లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్‌రైజ్ ని చూస్తూ.. క్లీంకారతో పాటు చరణ్ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. ఈ వీడియో పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read Also : BRS : 2028 నాటికి బీఆర్‌ఎస్‌ “దుకాణ్‌ బంద్”?