గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు (Ram Charan – Buchhibabu) సానా దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi) ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. చరణ్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన రామ్ చరణ్ స్పోర్ట్స్ కోచ్ లుక్ ఫోటో అభిమానులను ఆకట్టుకుంది. గుబురు గెడ్డంతో మాస్ రఫ్ లుక్‌లో కనిపించిన చరణ్, “పెద్ది కోసం ఇలా మారుతున్నాను… దృఢ సంకల్పం, గొప్ప ఆనందం” అంటూ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను షేర్ చేశారు. ఇది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ భారీగా వర్కౌట్స్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ యాక్షన్ సీన్లు ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై కనిపించని విధంగా ఉన్నాయని టాక్. తదుపరి షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, టాకీ పార్ట్‌లు షూట్ చేయనున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఫ్యామిలీ, ఎమోషనల్ కోణాన్ని కూడా జోడిస్తున్నారని సమాచారం.
Shocking : జస్ట్ మిస్.. ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టబోయిన యుద్ధ విమానం
మూవీలో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో గౌర్నాయుడుగా కనిపించనున్నారు. అలాగే ‘మీర్జాపూర్’ ఫేం దివ్యేందు శర్మ, జగపతిబాబు, అర్జున్ అంబటి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్‌ను సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే, సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఓటీటీ డీల్ ఫిక్స్ అయిన విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్, ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం అన్ని భాషలకు కలిపి ఈ డీల్ విలువ రూ.110 కోట్లు అని తెలుస్తోంది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే కాదు ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు వచ్చిన పెద్ద డీల్‌లలో ఒకటిగా పేర్కొంటున్నారు.