గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘Peddi’ షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchhibabu) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రైన్ సెట్‌లో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని విధంగా హై-ఆక్టెన్స్, హై-రిస్క్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొంత కీలక తారాగణం పాల్గొంది. ఈ షెడ్యూల్ జూన్ 19 తో పూర్తి కానుంది.
CM Revanth : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్…ఈసారి ఎందుకంటే !!
ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తైన తర్వాత, దర్శకుడు బుచ్చిబాబు టాకీ పార్ట్‌తో పాటు హీరో, హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్టు సమాచారం. సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు కొన్ని షార్ట్ షెడ్యూల్స్‌లో పాల్గొన్నప్పటికీ, రామ్ చరణ్‌తో కలిసి రొమాంటిక్ సీన్ల కోసం త్వరలో మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Bayya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ యాదవ్.. ఇన్ని రోజులు ఎక్కడా..?
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాటల పనిలో బిజీ గా ఉన్నారు. ఈ లోపు మిగతా షూటింగ్‌ను దర్శకుడు పూర్తి చేయాలనే యత్నంలో ఉన్నారు. చిత్రంలో సీనియర్ నటులు జగపతి బాబు, శివరాజ్ కుమార్, వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, అర్జున్ అంబటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పగా, ఇటీవలే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయని సమాచారం.