Ram Charan: చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు.. రామ్ తో జాన్వీ రొమాన్స్ అంటూ!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సి 16. ఇందులో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Mar 2024 11 13 Am 7500

Mixcollage 09 Mar 2024 11 13 Am 7500

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సి 16. ఇందులో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక పాత వీడియో వైరల్ అవ్వడంతో వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.

అలాగే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవికి సంబంధించిన ఒక పాత వీడియో బయటకు రావడంతో వీరిద్దరి కాంబినేషన్ పై మరింత బజ్ పెరిగింది. చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన జగదేకవీరుడు అతిలోక హీరోయిన్ గా చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. దాదాపు ఏడేళ్ల క్రితం చిరంజీవి చేసిన కోరిక అప్పట్లో కొత్తగా అనిపించింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఆర్ సీ 16లో జాన్వీ కపూర్ నటించనుండటంతో చిరు కామెంట్స్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

చిరంజీవి మొదట సూచించినట్లుగా ఈ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరికి రీమేక్ కాకపోయినా, ఈ కొత్త కలయికపై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఆర్సీ 16 ఉత్తరాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ తీయడం, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సౌండ్ ట్రాక్ కంపోజ్ చేయడంతో సినిమాటిక్ విజువల్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆర్ సి 16 పై మరిన్ని అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రామ్ చరణ్ తన ఇతర ప్రాజెక్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఎస్.శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య వంటి స్టార్ తారాగణంతో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత చరణ్ తో జోడీ కడుతుండటంతో ఇది ఆమెకు రెండో మూవీగా చెప్పవచ్చు.

  Last Updated: 09 Mar 2024, 11:13 AM IST