Site icon HashtagU Telugu

Satya Krishnan : అవకాశాల కోసం లొంగిపోతున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ షాకింగ్ కామెంట్స్..!

Character Artist Satya Krishnan About Casting Couch In Industry

Character Artist Satya Krishnan About Casting Couch In Industry

Satya Krishnan టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సత్య కృష్ణన్ శేఖర్ కమ్ముల తీసిన డాలర్ డ్రీంస్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అంతకుముందు తాజ్ కృష్ణలో జాబ్ చేస్తున్న ఆమె ఆ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల ఆనంద్ లో కూడా ఆమె నటించారు. ఆ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డుని కూడా అందుకున్నారు సత్య కృష్ణన్.

ఆనంద్ నుంచి ఆమె కెరీర్ తిరిగు చూసుకోలేదు. బొమ్మరిల్లు, దేవదాస్, సౌఖ్యం, మెంటల్ కృష్ణ, ఒక్కడినే ఈమధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గాలోడు సినిమాల్లో ఆమె నటించారు. ఇటీవల నాగ చైతన్య నటించిన దూత వెబ్ సీరీస్ లో కూడా నటించారు సత్య కృష్ణన్.

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కాస్టింగ్ కౌచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉందని.. అది ఎదురైనప్పుడు ఆడవాళ్లు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని అన్నారు సత్య కృష్ణన్. ఎదుటి వారు లిమిట్స్ క్రాస్ చేస్తుంటే ధైర్యంగా ఎదురు చెప్పాలని అన్నారు. ఇండస్ట్రీలో చాలా వరకు కమిట్మెంట్ ఒప్పుకోకపోతే పాత్రలు ఇవ్వరనే భయంతో కొందరు లొంగిపోతారని.. అది కరెక్ట్ కాదని అంటున్నారు సత్య కృష్ణన్.

తన కెరీర్ లో ఎప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని అన్నారు ఆమె. అయితే అలాంటి పరిస్థితి ఎదుర్కున్న వారిని ప్రత్యక్షంగా చూశానని ఆమె అన్నారు. సినిమాలు తప్ప వేరే లైవ్ లేదనుకున్న వారు నిజంగా కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోవడం కష్టమే అయినా సరే అలాంటి టైం లోనే తమని తాము కాపాడుకోవాలంటే ధైర్యంగా ఉండాలని ఆమె అన్నారు. నటిగానే కాదు ఈమధ్య నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్న సత్య కృష్ణన్ కి డైరెక్షన్ చేయాలన్న ఆలోచన కూడా ఉందని ఆమె వెల్లడించారు.

Also Read : Raviteja Eagle OTT Deal : ఈగల్ ఓటీటీ డీల్ క్లోజ్.. అందులో రానున్న రవితేజ మూవీ..!