Silk Smitha Biopic: సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ.. ఫస్ట్ లుక్ రిలీజ్

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రానుంది. జయరామ్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. చంద్రికా రవి సిల్క్ స్మిత పాత్రను పోషిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
silk smitha the untold story

silk smitha the untold story

Silk Smitha Biopic: అలనాటి నటి సిల్క్ స్మితను తలచుకోగానే.. ఆమె మత్తెక్కించే చూపులు, కైపెక్కించే సొగసులే గుర్తొస్తాయి. ఒకప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించిన సిల్క్ స్మితకు.. ఇప్పటికీ అభిమానులున్నారు. 1960, డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆమె స్క్రీన్ నేమ్ స్మిత.. మొదటి సినిమాలో ఆమె నటించిన క్యారెక్టర్ పేరు సిల్క్ కావడంతో.. సిల్క్ స్మిత అనే పేరుతోనే పాపులర్ అయింది.

సిల్క్ స్మిత నటి మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. చాలా సినిమాల్లో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1991లో వచ్చిన సీతాకోకచిలుక సినిమాలో తొలిసారి శరత్ బాబుకు మంచి భార్య పాత్రలో కనిపించింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదుర్కొన్న సమస్యలతో సతమతమైన స్మిత.. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని అపార్ట్ మెంట్ లో చనిపోయింది. ఆమె మరణం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు.

కాగా.. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రానుంది. జయరామ్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. చంద్రికా రవి సిల్క్ స్మిత పాత్రను పోషిస్తోంది. సిల్క్ స్మిత.. ది అన్ టోల్డ్ స్టోరీ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం సిల్క్ స్మిత జయంతి సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో చంద్రికను చూస్తే.. సిల్క్ స్మితలానే కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. బాలీవుడ్ లో స్మిత జీవితం ఆధారంగానే డర్టీ పిక్చర్ తెరకెక్కింది. ఆ సినిమాలో విద్యాబాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్లో నటించారు.

 

  Last Updated: 02 Dec 2023, 08:47 PM IST