Indraprastham : మళ్లీ తెరమీదకు YSR -CBN వెబ్ సిరీస్

ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 11:44 AM IST

ప్రస్తుతం వెబ్ సిరీస్ (Web-Series) ల హావ నడుస్తుంది. ఓటిటి (OTT) పుణ్యమా అని సినీ లవర్స్ వెబ్ సిరీస్ లకు బాగా అలవాటు పడ్డారు. వందలు వందలు ఖర్చు పెట్టి థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసే బదులు..హ్యాపీగా ఇంట్లోనే ఫ్యామిలీ తో కలిసి ఓటిటి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటిటి డిమాండ్ నేపథ్యంలో చాలామంది వెబ్ సిరీస్ లు తీస్తూ అలరిస్తున్నారు. పొలిటికల్ , క్రైమ్ , ఫన్ , రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్ లలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా వైస్సార్ , చంద్రబాబుల (Chandrababu -YSR ) జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్థానం ఫేమ్ దేవాకట్టా (Devakatta) వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనీ ఎప్పటి నుండి అనుకుంటున్నారు. ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని..దీనికి ‘ఇంద్రప్రస్థం'(Indraprastham) అనే టైటిల్‌ తో మోషన్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇది జరిగి మూడేళ్లుదాటినా ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కనీసం దీని ఊసే లేదు. కానీ తాజాగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది.

రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉండే వైఎస్సార్ – చంద్రబాబు నిజ జీవితంలో ఒకప్పుడు మంచి మిత్రులనే అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. యూత్ కాంగ్రెస్‌ ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి మెలిసి వుండేవారని, ఇద్దరికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అంటారు. అయితే ఆ తర్వాత రోజుల్లో వేర్వేరు పార్టీల్లో ఉండటం వల్ల వారి మధ్య వైరం పెరిగింది. ఈ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి అంశాలనే కోర్ పాయింట్ గా తీసుకొని దర్శకుడు దేవాకట్టా కథ రాసుకున్నారు. ఈ కథలో చంద్రబాబు పాత్రలో రానా ను కూడా అనుకున్నారు. కానీ రానా ఇంట్రస్ట్ చూపించకపోయేసరి ప్రాజెక్ట్ ఆలా హోల్డ్ లో పెట్టారు.

Read Also : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు

ఇక ఇప్పుడు ఈ కథను వెబ్ సిరీస్ గా మూడు పార్ట్శ్ గా తెరకెక్కించాలని దేవాకట్టా చూస్తున్నారట. ప్రముఖ ఓటిటి సంస్థ సోని లివ్ దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. అంతే కాదు ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అది పినిశెట్టి ఓకే చెప్పారట. మరో పాత్ర కోసం నటుడ్ని ఎంపిక చేసే పనిలో దేవాకట్టా ఉన్నారట. మొత్తం మీద ఈ ఇయర్ లోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు.