Chandrababu Unstoppable: వైఎస్సాఆర్ నా బెస్ట్ బడ్డీ.. బాలయ్య టాక్ షోలో బాబు కామెంట్స్!

తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు తన యంగేజ్ లో వైఎస్‌ఆర్‌తో చాలా సన్నిహితంగా తిరిగారని

  • Written By:
  • Updated On - October 12, 2022 / 07:52 AM IST

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు తన యంగేజ్ లో వైఎస్‌ఆర్‌తో చాలా సన్నిహితంగా తిరిగారని చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  సాధారణంగా ప్రత్యర్థులతో కత్తులు దూసే రాజకీయ వేదికపై కాకుండా తన బావ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షోలో ఆయన ఈ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

బాలకృష్ణ సూపర్-హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 1  అందర్నీ అలరించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల నుంచి బిగ్ రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబునాయుడు రావడం మరింత ఆసక్తిని రేపింది.

షో మేకర్స్ విడుదల చేసిన ప్రోమో వైరల్‌గా మారింది. ప్రోమోలో బాలకృష్ణ చంద్రబాబు నాయుడుని చాలా ప్రశ్నలు అడగడం కనిపించింది. దానికి చంద్రబాబు జోవియల్ గా ఆన్సర్స్ ఇచ్చారు. నాయుడు సాధారణంగా గంభీరంగా కనిపిస్తుంటారు. కానీ బాలయ్య షోలో చాలా రిలాక్స్‌డ్ గా కనిపించారు. మరీ ముఖ్యంగా నవ్వుతో కనిపించడం అటు ప్రేక్షకులను ఇటు, పొలిటికల్ లీడర్స్ ను ఆకట్టుకుంది.

తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్నకు.. చంద్రబాబునాయుడు వైఎస్ఆర్ (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) పేరును ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనితో యవ్వన రోజుల్లో స్నేహం, తరువాత రాజకీయాల్లో తీవ్రమైన శత్రుత్వం రెండూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని వైఎస్ తరచుగా రాజకీయ నాయకుడు అని పిలిచేవారట.