సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan ) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న మోహన్..ఈరోజు ఉదయం అపోలో హాస్పటల్ లో తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ మరణ (Chandra Mohan Dies) వార్త తెలిసి యావత్ చిత్ర సీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తుంది. కేవలం సినీ ప్రముఖులే కాక రాజకీయ నేతలు సైతం చంద్రమోహన్ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
అలాగే చంద్రమోహన్ జ్ఞాపకాలనే కాక ఆయన పోగొట్టుకున్న ఆస్తుల వివరాలను (Chandra Mohan Properties) కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ మధ్య చంద్రమోహన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..తన జీవితంలో రూ. 100 కోట్లు ఆస్తిని పోగొట్టుకున్నానని చెప్పిన విషయాన్నీ అంత గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణలోని కొంపల్లి లో 35 ఎకరాల ద్రాక్ష తోటను కొన్నాడట, కానీ దీనిని దగ్గరుండి చూసుకునే వారు లేకపోవడంతో చాలా తక్కువకే అమ్మేశాడట. అదే విధంగా మద్రాస్ లోనూ 15 ఎకరాలు ఉంటే అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆస్తులు ఆంటి విలువను చూస్తే రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.
ఇక కథానాయకుడిగా 175 పైగా చిత్రాల్లో నటించారు. మొత్తం 932 సినిమాల్లో నటించి మెప్పించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
We’re now on WhatsApp. Click to Join.
క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.
చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు చంద్రబాబు తో జత కట్టి స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగారు. ఇక ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు.
Read Also : Chandra Mohan Demise: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, వైస్ జగన్ సంతాపం