Site icon HashtagU Telugu

Chandini Chowdhary : ఆ హీరోయిన్ చేత S.R.H బెస్ట్ అనిపించేశారుగా..?

Chandini Chowdary

Chandini Chowdary

Chandini Chowdhary తెలుగు అమ్మాయి చాందిని చౌదరి రీసెంట్ గా విశ్వక్ సేన్ తో నటించిన గామితో సక్సెస్ అందుకుంది. హీరోయిన్ గా ఎవరైనా కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటారు కానీ చాందిని చౌదరి మాత్రం వెరైటీ సినిమాలతో అలరిస్తున్నారు. కమర్షియల్ సినిమాలు చేయనని కాదు కానీ కథలో ఏదైనా కొత్తదనం ఉండాల్సిందే అంటుంది అమ్మడు. గామి సక్సెస్ తో మరోసారి ఆమె ప్రతిభ అందరికీ తెలిసేలా చేసింది.

ఇక లేటెస్ట్ గా అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో నటిస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తిలో కూడా నటిస్తుంది చాందిని. ఈ సినిమా ప్రెస్ మీట్ లో తనకు నచ్చిన ఐ.పి.ఎల్ టీం ఏంటని అడిగితే తను ఇచ్చిన ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. తను ఆంధ్రా కాబట్టి ఆంధ్రా టీం లేదు కాబట్టి తనకు ఏ టీం కూడా ఇష్టలేదని. తాను ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా చూడలేదని చెప్పింది.

ప్రాంతాలుగా విడిపోయినా సినీ పరిశ్రమ మాత్రం తెలుగు రెండు రాష్ట్రాలు తమవే అనుకుంటున్నారు. కానీ చాందిని తమది ఆంధ్రా తమకంటూ ఒక టీం లేదని కాస్త టంగ్ స్లిప్ అయ్యింది. తన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు కానీ అది జనాలకు రాంగ్ గా వెళ్లింది.

అప్పటినుంచి చాందిని చౌదరి మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా చాందిని ఒక నోట్ రిలీజ్ చేసింది. తెలుగు రెండు రాష్ట్రాలు తనకు ఇష్టమని. ఎస్.ఆర్.హెచ్ టీం కు బెస్ట్ విషెస్ అని రాసుకొచ్చింది. తాను ఆంధ్రా తమకంటూ ఒక టీం లేదని ముందు మాట్లాడిన చాందిని వెంటనే తన తప్పు సరిదిద్దుకుంది. సోషల్ మీడియా ట్రోల్స్ వల్లే అమ్మడు ఇలా కాస్త తగ్గిందని తెలుస్తుంది.

తన కామెంట్స్ ని ఎడిట్ చేశారని అంటూ తెలుగు రెండు రాష్ట్రాలను గర్వంగా భావిస్తానని. తాను కూడా రెండు రాష్ట్రాలకు సంబందించిన వ్యక్తినే అని రాసుకొచ్చింది. ఈ క్లారిటీ కామెంట్ చేసేప్పుడు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎడిటింగ్ మిస్టేక్ అని తప్పించుకుంటుంది కానీ చాందిని చేసిన కామెంట్స్ అందరు చూసిన తర్వాతే ఆమె పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

Exit mobile version