Chandini Chowdary : తెలుగు అమ్మాయి చాందిని చౌదరి.. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపుని సంపాదించుకొని సిల్వర్ స్క్రీన్ వరకు చేరుకున్నారు. ఇక బిగ్ స్క్రీన్ పై ఏ కథలు పడితే ఆ కథలు కాకుండా.. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ని పలకరిస్తుంటారు. ఒక నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ.. మంచి కథలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, కలర్ ఫోటో వంటి సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
ఈ సినిమాలు మాత్రమే కాదు, ప్రస్తుతం చాందిని చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కంటెంట్ ఉన్న కథలతోనే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘యేవమ్’ సినిమాలను సిద్ధం చేస్తున్న చాందిని.. తాజాగా మరో సినిమాకి సైన్ చేసారు. నేడు ఆ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ సినిమాకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే హోమ్లీ టైటిల్ ని పెట్టారు. ఇక ఈ మూవీలో మేల్ లీడ్ ని విక్రాంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ హీరో గత ఏడాది ‘స్పార్క్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని.. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ దర్శకుడు గతంలో అల్లు శిరీష్ తో ‘ABCD’ అనే బ్యూటిఫుల్ కామెడీ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ని అలరించడానికి ఈ ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో సిద్ధమవుతున్నారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి.. సాధ్యమైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారని మేకర్స్ తెలియజేసారు.
Here are some candid moments from the pooja ceremony of #SanthanaPrapthirasthu 🤩
⭐ing @ThisIsVikranth @iChandiniC in lead roles ❤️🔥
Directed by @sanjeevflicks 🎬
Produced by @madhurasreedhar & #NirviHariPrasadReddy 💰
A @kasyapsunil6 Musical 🎹@MahiBrahmareddy @SheikDawoodG1… pic.twitter.com/SXgQnr1lRE— Sreenivas Gandla (@SreenivasPRO) May 18, 2024