Site icon HashtagU Telugu

Anushka Sharma: చక్దా ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి..సందడి చేసిన అనుష్క శర్మ

Its A Wrap Chakde Express Shoot Comes To An End Reel And Real Life Jhulan Goswami Celebrating With Director

Its A Wrap Chakde Express Shoot Comes To An End Reel And Real Life Jhulan Goswami Celebrating With Director

బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ తాజాగా నటిస్తోన్న సినిమా ‘చ‌క్‌దే ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమా షూటింగ్ నేటి పూర్తి అయ్యింది. దీంతో అనుష్క శర్మ షూటింగ్ సెట్స్‌లో చివ‌రి రోజు యూనిట్‌తో క‌లిసి స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు. షూటింగ్ దిగ్విజయంగా పూర్తైన సంద‌ర్భంగా అనుష్క‌, మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి, డైరెక్ట‌ర్ ప్రొసిత్ రాయ్‌తో క‌లిసి ఆమె కేక్ కట్ చేసి సందడి చేశారు.

కేక్ పై ఝులాన్ జెర్సీ నంబ‌ర్ 25 ఉంచి ఆమె కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల‌ను అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చ‌క్‌దే ఎక్స్‌ప్రెస్ షూటింగ్ పూర్తయ్యిందని, చివ‌రి క్లాప్ కొట్టి, సినిమా షూటింగ్‌ను ముగించిన ఝులన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అనుష్క శర్మ తెలిపారు.

2017 డిసెంబ‌ర్‌లో క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని అనుష్క శర్మ వివాహమాడింది. పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క నాలుగేళ్ల పాటు సినిమాలు చేయలేదు. అయితే వీరికి పాప వామిక పుట్టిన త‌ర్వాత ఆమె చ‌క్‌దే ఎక్స్‌ప్రెస్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. మ‌హిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఝులన్ గోస్వామి జీవిత క‌థ ఆధారంగా చక్ దే సినిమా రూపొందుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తంగా 65 రోజులు, 7 షెడ్యూల్స్‌, 6 న‌గ‌రాల్లో పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది. ప్రొసిత్ రాయ్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. ఝులన్ 2002లో క్రికెట్ రంగంలోకి ఆరంగ్రేటం చేయగా ఆమె కెరీర్ లో 12 టెస్టులు, 204 వ‌న్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడారు. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 355 వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత ఆమె క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ యువ క్రీడాకారిణులకు తన సూచనలను అందజేస్తున్నారు.