Site icon HashtagU Telugu

Naga Chaitanya : సామ్ ను చైతు ఇంకా మరచిపోలేకపోతున్నాడా..?

Naga Chaitanya Samantha Tat

Naga Chaitanya Samantha Tat

Chaitu still unable to forget Sam..? : నాగ చైతన్య ..సమంతను ఇంకా మరచిపోలేకపోతున్నాడా..? ప్రస్తుతం అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏమాయ చేసావే తో జోడి కట్టిన నాగ చైతన్య – సమంత (Naga Chaitanya and Samantha)లు నిజ జీవితంలో కూడా జోడి కట్టారు. మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. వీరి జంట చూసి ఎన్ని జంటలు కుల్లుకున్నాయో..ఎంతమంది ఈర్ష పడ్డారో తెలియంది కాదు..అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమె అదృష్టమని అంత మాట్లాడుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో పలు గొడవలు జరిగి..చివరకు విడాకులు (Divorce ) తీసుకునే వరకు వచ్చింది. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి..ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పకపోయినప్పటికీ, అభిమానులు మాత్రం రకరకాలుగా మాట్లాడుకున్నారు.

రీసెంట్ గా చైతు ..నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తో నిశ్చితార్థం చేసుకున్నాడు. నాగార్జున ఇంటి వద్ద ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాల సింపుల్ గా జరిగింది. సమంత తో విడాకుల అనంతరం నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్ద‌రూ త‌ర‌చూ జంట‌గా క‌నిపించ‌డంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ చైతూ కానీ శోభిత కానీ ఎప్పుడూ ఈ విష‌యంపై నోరు విప్ప‌లేదు. త‌మ ప‌ర్స‌న‌ల్ లైఫ్ త‌మ‌కుంద‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాల్లో త‌మ‌కు ప్రైవ‌సీ కావాలంటూ జ‌వాబు దాట‌వేసేవారు. అయితే ఎట్ట‌కేల‌కు నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి సిద్ధమయ్యారు.

ఇప్పుడు కొత్త భార్య వస్తుంది కాబట్టి గత పెళ్లినాటి జ్ఞాపకం ఉన్న టాటూ సంగతి ఏంటి అంటూ మీడియా ప్రశ్నించగా.. చైతు అది తొలగించను అని తేల్చి చెప్పాడట. ఆ టాటూ తో వచ్చిన సమస్య ఏం లేదు కదా.. అది అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సమంతాను ఇంకా మరిచిపోలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి తర్వాత కూడా మొదటి పెళ్లి తాలూకా గుర్తును తనతో పాటే ఉంచుకున్నాడు అంటే ఇండైరెక్టుగా అది సమంత జ్ఞాపకమే కదా .. దీని వెనుక ఇంకా ఏదైనా మ్యాటర్ ఉందా అనే కోణంలో నెటిజన్లు ఆరా తీస్తూ ఉండడం గమనార్హం.

Read Also : Sampoornesh Babu : మోసాన్ని భరించలేక సంపూర్ణేష్ ఇండస్ట్రీకి దూరమయ్యాడా..?