సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏమాయ చేసావే (Yemaya Chesave) చిత్రంతో సమంత (Samantha) మాయలో పడిన చైతు..కొంతకాలం వరకు రహస్య ప్రేమ కొనసాగించి..ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో పెళ్లి (Naga Chaitanya Samantha wedding) చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం ఎంతోకాలం సాగలేదు. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు రావడం తో కోర్ట్ ద్వారా విడాకులు తీసుకొని ఎవరి..దారి వారు చూసుకున్నారు. విడాకుల తర్వాత చైతు సినిమాల తో బిజీ గా ఉన్నప్పటికీ..సమంత మాత్రం ఓ ప్రాణాంతక వ్యాధి బారిన పడి చావు అంచుల వరకు వెళ్లి దేవుడి దయ తో క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం ఫై శ్రద్ద పెట్టి సినిమాలకు దూరమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చైతు మాత్రం సమంత తో విడాకుల అనంతరం నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ చైతూ కానీ శోభిత కానీ ఎప్పుడూ ఈ విషయంపై నోరు విప్పలేదు. తమ పర్సనల్ లైఫ్ తమకుందని, వ్యక్తిగత విషయాల్లో తమకు ప్రైవసీ కావాలంటూ జవాబు దాటవేసేవారు. అయితే ఎట్టకేలకు ఈరోజు ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు గురువారం ఉదయం 9 గంట 42 నిమిషాలకు నిశ్చితార్థం జరుపుకున్నారు. తమ కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ నాగార్జున ట్వీట్ చేసి చైతు రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసాడు. ఈ మేరకు చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదంతా బాగానే ఉంది కానీ చైతు కు సమంత లవ్ ప్రపోజ్ చేసిన తేదీనే ఇప్పుడు కాబోయే భార్యతో నిశ్చితార్థం చేసుకున్నాడని సోషల్ మీడియా లో నెటిజన్లు , ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చైతు -సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావే’ రిలీజయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇదేరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలను ఇన్స్టా నుంచి తొలగించి, కేవలం ‘మజిలి’ సినిమా ఫొటోలే మాత్రమే ఉంచాడు.
ఇక శోభిత విషయానికి వస్తే.. ఏపీలోని తెనాలిలో 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. పదహారేళ్లూ వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత.. వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకుంది.
శోభిత ముందుగా ఒక మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టి… 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. “ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013” టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత ఇండియా తరపున “మిస్ ఎర్త్ 2013” పోటీల్లోనూ పాల్గొంది. కానీ అక్కడ టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. ముందుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె..తెలుగు లో అడివి శేషుతో కలిసి గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించింది.
Read Also : Kerala Rains : కేరళకు మరోసారి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్