Chaitu Emotional Video : నా బాధను పంచుకున్నారు.. మీ రుణం తీర్చుకోలేనిది!

టాలీవుడ్ హీరో నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే...

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:49 AM IST

టాలీవుడ్ కపుల్ చైతూ, సామ్ విడిపోయి రోజులు గడస్తున్నా.. వాళ్లిద్దరికి సంబంధించి ఏదోక వార్త వైరల్ గా మారుతూనే ఉన్నాయి. సమంత ‘చార్ ధామ్’ యాత్రకు వెళ్లడం.. తన ప్రతిష్టకు భంగం కల్గిస్తున్నారంటూ కోర్టుకెక్కడం.. ఆ తర్వాత చైతూ పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం… లాంటి విషయాలు చర్చనీయాంశం మారాగా.. ఇక చైతూ కొత్త అపార్ట్ మెంట్ కు షిప్ట్ అవ్వడం.. సైలెంట్ గా సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం.. తాజాగా ఓ ఎమోషన్ వీడియో రిలీజ్ చేయడం లాంటివీ కూడా వైరల్ అయ్యాయి. కష్టకాలంలో తన పట్ల ప్రేమను, అండగా నిలిచిన ఫ్యాన్స్ కు నాగచైతన్య ధ్యాంక్స్ చెబుతూ ఓ ఎమోషన్ వీడియో పోస్ట్ చేశాడు.

‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ మూవీస్ సక్సెస్ విజయాన్ని జరుపుకోవడానికి ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల అభిమానులు, ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారని నాకు తెలిసింది. ఇది వింటున్నందుకు సంతోషంగా ఉంది. దీన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తాయో, విడుదల తర్వాత కలెక్షన్లు ఎలా ఉంటాయో, మాకు చాలా భయాలు ఉండేవి. కానీ సినిమా విడుదలయ్యాక, మీరు ఊహించని విధంగా రెస్పాన్స్ ఇచ్చారు. మాకు మద్దతుగా నిలిచారు. మేం సినిమా విడుదల తేదీలు మార్చినా.. నిరాశ చెందకుండా మా సినిమాలను ఆదరించారు’’ అంటూ వీడియో షేర్ చేశారు.

అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీస్ రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా అఖిల్ అక్కినేని ఫస్ట్ టైం సక్సెస్ రుచి చూసినట్టు చెప్పక తప్పుదు. అంతకుముందు అఖిల్ చేసినా సినిమాలన్నీ ఆశించనంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో బ్యాచిలర్ మంచి హిట్ ను అందించింది. విడుదలై పదిరోజులు కావోస్తున్నా మంచి కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం.