Site icon HashtagU Telugu

Chaitanya Jonnalagadda: సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసిన జొన్నలగడ్డ చైతన్య.. సైలెన్స్ సైలెన్స్ అంటూ?

Mixcollage 16 Mar 2024 12 34 Pm 2391

Mixcollage 16 Mar 2024 12 34 Pm 2391

మెగా డాటర్ నిహారిక, మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత తమ రిలేషన్ షిప్ విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు, షూటింగులతో బిజీగా ఉన్న మెగా డాటర్ అప్పుడప్పుడు తన రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. రెండో పెళ్లి చేసుకుంటానంటూ, పిల్లల్ని కనాలని ఉందంటూ నిహారిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు చైతన్య జొన్నల గడ్డ కూడా తన పని తాను చేసుకుంటున్నాడు.

అయితే ఇటీవల నిహారిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్ సైడ్ వాదనను మాత్రమే ప్రచారం చేయడం తప్పంటూ ఇన్ డైరెక్టుగా నిహారిక పై కౌంటర్లు వేశాడు. సాధారణంగా చైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అయితే సైలెన్స్.. సైలెన్స్ అంటూ తాజాగా అతను షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలెన్స్‌.. ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుంది.

 

ఇదే మౌనం దేవుడితో కలిపే మాధ్యమం అంటూ ఫిలాసఫీకల్ గా రాసుకొచ్చాడు చైతన్య. ప్రస్తుతం చైతన్య జొన్నలగడ్డ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అతను ఏ ఉద్దేశంతో చేశాడో కానీ నెటిజన్లు మాత్రం క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఏమైందన్నా.. ఎందుకు సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టావ్‌ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.