Razakar Controversy: రజాకార్ సినిమా నిర్మాతకు కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత

రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డికి హాని కలిగించేలా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిచింది కేంద్ర హోంశాఖ.

Razakar Controversy: రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డికి హాని కలిగించేలా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిచింది కేంద్ర హోంశాఖ. మార్చి 15న తెలుగు, హిందీ తదితర భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.

రజాకార్ చిత్రం తొలి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంది. కానీ చివరికి తెలంగాణ హైకోర్టు విడుదలకు లైన్ క్లియర్ చేసింది. అంతకుముందు రజాకార్ సినిమా విడుదలను అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీసీఆర్‌ తెలంగాణ చాప్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అడ్వకేట్‌ అఫ్సర్‌ జహాన్‌ హైకోర్టులో సంస్థ ప్రయోజనాలను వాదించారు.ఈ సినిమా హిందువులు, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని జహాన్ ఆందోళన వ్యక్తం చేశారు.కాగా వాదనలు విన్న ధర్మాసనం ఈ చిత్రానికి సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ లభించిందని పేర్కొంది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల పాటు హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ తరానికి అప్పటి విషయాలను తెలియజెప్పేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నంలో భాగంగా చిత్రాన్ని తెరకెక్కించారు. రజాకార్ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించారు.

Also Read: Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు