EVOL : ఇటీవల ఓటీటీల్లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. థియేటర్లో రిలీజ్ చేసే సినిమాలకు సెన్సార్ ఉండటం, ఓటీటీలకు ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో అడల్ట్ సినిమాలు అన్ని ఓటీటీలను టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఓ బోల్డ్ కంటెంట్ సినిమా కూడా ఓటీటీ లోకి రాబోతుంది.
రామ్ యోగి వెలగపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవోల్’ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సినిమా రెడీ అయింది, ప్రెస్ మీట్స్ పెట్టి ప్రమోషన్స్ కూడా చేసారు. కానీ సెన్సార్ కి వెళ్ళాక సెన్సార్ బోర్డు వాళ్ళు ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉండటంతో సినిమాలో చాలా కట్స్ చెప్పారు. ఆ కట్స్ చేయకపోతే థియేటర్లో రిలీజ్ చేయడానికి వీలు లేదని సెన్సార్ బోర్డు చెప్పినట్టు సమాచారం.
దీంతో ఆ కట్స్ చేయడానికి ఒప్పుకోని డైరెక్టర్ సినిమాని డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. దీంతో ‘ఎవోల్’ సినిమా ఆహా ఓటీటీలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. లవ్ ని ఇంగ్లీష్ లో తిరగేస్తే ఎవోల్ అని, స్టోరీ కూడా రివర్స్ లవ్ అని అందుకే టైటిల్ అలా పెట్టినట్టు డైరెక్టర్ గతంలో చెప్పాడు. ఇక ఇప్పటికే ‘ఎవోల్’ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ లోనే చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. సెన్సార్ బోర్డు నో చెప్పింది అంటే ఇక సినిమాలో ఏ రేంజ్ బోల్డ్ కంటెంట్ ఉందో చూడాలి. ఆ ఎవోల్ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
Also Read : Murari Sequel : ‘మురారి’ సీక్వెల్ పై కృష్ణవంశీ కామెంట్స్.. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు..