Bhairava Dweepam : ‘భైరవద్వీపం’ సినిమాకి సెన్సార్‌ బోర్డు ఒక కట్‌ కూడా చెప్పలేదట.. కానీ హెచ్చరిక..

'భైరవద్వీపం' సినిమాకి సెన్సార్‌ బోర్డు క్లీన్ 'U' సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే మూవీ టీంకి ఒక హెచ్చరికని మాత్రం ఇచ్చిందట.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 09:00 PM IST

బాలకృష్ణ(Balakrishna), సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైరవద్వీపం'(Bhairava Dweepam). ఈ సినిమాలో రోజా(Roja) హీరోయిన్ గా నటించింది. 1994లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఇక ఈ చిత్రాన్ని సింగీతం తెరకెక్కించిన తీరు.. చిన్న పిల్లల్ని నుంచి పెద్దలు వరకు ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. అప్పటి ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా ఈ చిత్రం ఫేవరెట్.

మరి అలాంటి సినిమాకి కత్తెర్లు వేయాలని సెన్సార్ బోర్డుకు మాత్రం ఎందుకు అనిపిస్తుంది. అందుకనే ఎటువంటి కట్స్, అభ్యంతరాలు లేకుండా.. ‘భైరవద్వీపం’ సినిమాకి సెన్సార్‌ బోర్డు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే మూవీ టీంకి ఒక హెచ్చరికని మాత్రం ఇచ్చిందట. సినిమాలో గుర్రాల పై ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశంలో.. గుర్రాలు పై బాణాలు వేయగా అవి కింద పడిపోతాయి. గుర్రాలు అలా పడిపోవడానికి కాళ్ళకి అడ్డంగా తాడు కట్టి సన్నివేశం తెరకెక్కించారు.

అయితే ఆ సన్నివేశం పై తమకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేసిన సెన్సార్ బోర్డు.. ఒక హెచ్చరికని మాత్రం జారీ చేసింది. గుర్రాలు పడిపోయే విధానం చూస్తే వన్య ప్రాణి సంరక్షణ సంఘం వారు అభ్యంతర తెలియజేసేలా ఉంది. ఒకవేళ వాళ్ళు అభ్యంతరం పెడితే మాత్రం ఆ సీన్ ని సినిమా నుంచి తొలిగించాలని హెచ్చరించారట. మరి ఆ సీన్ వన్య ప్రాణి సంరక్షణ సంఘం దృష్టికి వెళ్లలేదా..? లేక వారు కూడా ఆ సీన్ పై అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు అనుకునున్నారో ఏమో గాని.. మూవీ నుంచి ఆ సీన్ ని తొలిగించలేదట.

కాగా కాళ్ళకి అడ్డంగా తాడు కట్టి గుర్రాలను పడేసే సన్నివేశం తెరెక్కించేటప్పుడు.. ఆ గుర్రాల పరిస్థితి చూసుకోవడానికి గుర్రాల యజమానులు, రౌతులు పక్కనే ఉండేవారట. అవి పడిపోయిన వెంటనే వాటిని పైకి లేపి ఏమైనా గాయం అయ్యిందా అని చూసేవారు. ఒకవేళ గాయం అయితే వెంటనే చికిత్స కోసం వైద్యుడు దగ్గరికి తీసుకు వెళ్లేవారట.

Also Read : Balakrishna : ‘హనుమాన్’ కోసం వచ్చిన బాలయ్య.. సినిమా చూసి ఏమన్నారంటే?