Site icon HashtagU Telugu

Celebrity Ranks: ఇండియా టాప్ సెలబ్రిటీ స్టార్స్ వీళ్లే!

Bollywood

Bollywood

కపిల్ శర్మ అనగానే ‘ది కపిల్ శర్మ’ టాక్ షో ప్రతిఒక్కరికి గుర్తుకువస్తుంది. ఆ షోలో ఆయన వేసే పంచ్ డైలాగ్స్, సెటైర్స్, జోకులు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సందర్భానుసారంగా కామెడీ లో చేయడంలో కపిల్ ను మించినవాళ్లు ఎవరు లేరని చెప్పక తప్పదు. బాలీవుడ్ స్టార్ హీరోలకు సమాంతంరంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కపిల్. అయితే ‘ది కపిల్ శర్మ షో’ ముగిసినప్పటికీ కపిల్ శర్మ మనదేశంలో టాప్ సెలబ్రిటీ స్టార్ గా నిలిచాడు.

అతని పంచ్‌ల మొదలుకొని కామిక్ టైమింగ్ తో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాడు. అందుకే కపిల్ శర్మకు అభిమానులు ఎక్కువ. ప్రతి నెల ప్రముఖ మీడియా ఏజెన్సీ ఓర్మాక్స్ బాలీవుడ్ పరిశ్రమలతో టాప్ సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తోంది. ఈ మేరకు టాప్ 5 ‘మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్’ జాబితాను వెల్లడించింది. ‘ది కపిల్ శర్మ షో’ కపిల్ శర్మ, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అమితాబ్ బచ్చన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో ఉన్నారు. ఆశ్చర్యం కల్గించే విషయమే అయినా సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటివాళ్లను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు కపిల్ శర్మ.

టాప్ స్టార్స్ వీళ్లే

కపిల్ శర్మ

అమితాబ్ బచ్చన్

సల్మాన్ ఖాన్

శిల్పాశెట్టి

కికు శారదా

Exit mobile version