Site icon HashtagU Telugu

Heroines Summer Looks: సమ్మర్ సీజన్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్, లేటెస్ట్ పిక్స్ వైరల్!

Summer

Summer

వేసవి (Summer) వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. భగభగ మండే ఎండలకు తామర పువ్వులాంటి హీరోయిన్స్ బయట అడుగు పెడితే కందిపోవాల్సిందే. అందుకే సమ్మర్ సీజన్ మొదలైందంటే చాలు చాలామంది హీరోయిన్స్ వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. టీ పీస్ డ్రస్సులతో సెగలు రేపుతుంటారు. షూటింగ్స్ కు వెళ్లాలన్నా.. ప్రయాణాలు చేయాలనుకున్నా సీజన్ కు తగ్గట్టుగా డ్రస్సులు వేసుకోవడానికి ఇష్ట పడుతుంటారు. స్లీవ్ లెస్, స్కర్ట్స్, షాట్స్ వేసుకుంటూ సమ్మర్ ను బీట్ చేస్తుంటారు.

పూజా హెగ్డే (Pooja) అదిరే డ్రస్సులతో అదరగొడుతుంది. ఈ సమ్మర్ ఎక్కువగా టాప్ మినీ స్కర్ట్స్ వేసుకొని ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఎండ వేడిమి తట్టుకోలేక పొట్టి బట్టలను ఎక్కువగా వేసుకుంటుంది. పూల ప్రింట్‌లో ఉన్న అల్ట్రా-క్యూట్ మినీ డ్రెస్ నా వ్యక్తిగత ఇష్టమని చెబుతోంది పూజా. సమ్మర్ లో ఓపెన్ టాప్, మిని స్కర్ట్ కే తన ఓటు అంటోంది ఈ బ్యూటీ.

ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh) తన సౌకర్యవంతమైన స్టైల్ స్టేట్‌మెంట్‌కు పేరుగాంచింది. రిలాక్స్డ్, హాయిగా ఉండే దుస్తులను వేసుకుంటుంది. వేసవి తాపానికి షార్ట్ టాపులే బెస్ట్ అని అంటోంది. ఇక నయనతార ఎక్కువగా వైట్ కలర్ డ్రస్సులను వేసుకోవడానికి ఇష్టపడుతుంది.

సమంత (Samantha) కు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఆమె ధరించిన వదులుగా ఉండే రెట్రో స్టైల్ కో-ఆర్డ్ సెట్ సమ్మర్ అవుట్‌ఫిట్‌ను తెలియజేస్తోంది. ఒక జత సన్ గ్లాసెస్ సమంత వెంట ఉండాల్సిందే. రష్మిక మందన్న పొట్టిగా ఉండే సాఫ్ట్ నిట్ డ్రెస్‌లో క్రోచెట్ లుక్‌ను ఇష్టపడుంది. ఇటీవల ఆమె ధరించిన పొట్టి దుస్తులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇక బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఏమాత్రం తగ్గకుండా పొట్టి బట్టలను వేసుకుంటుంది.

Also Read: Tamannaah and Chiru: చిరు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన తమన్నా, ఎందుకో తెలుసా!

Exit mobile version