కేంద్రం ప్రకటించిన 2024 పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) జాబితాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి పద్మ విభూషణ్ (Padma Vibhushan ) దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి కి పద్మ విభూషణ్ రావడం పట్ల యావత్ సినీ ప్రేమికులు , చిత్రసీమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..చిరంజీవి కి విషెష్ అందిస్తున్నారు.
సినీ ప్రియులు, అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసి కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన్ను దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం వరించడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీరంగానికి చేసిన సేవలతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. తన మావయ్యకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్ అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైన ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు’ అంటూ పోస్ట్ చేశారు.
అలాగే తన తమ్ముడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని తెలిపారు. అలాగే టాలీవుడ్ హీరోలు నాని, మంచు విష్ణు, రాధిక శరతకుమార్; కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్ తదితరులు ట్విటర్ ద్వారా చిరంజీవికి కంగ్రాట్స్ తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పద్మ విభూషణ్ రావడం పట్ల చిరంజీవి స్పందిస్తూ..పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలియగానే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మన దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోసంగా ఉంది. తమ కన్నతల్లి కుటుంబంలో పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు. నా సినీ కుటుంబం అండదండలు, నన్ను నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ఆదరణ, ప్రేమ, అభిమానుల కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన గౌరవం మీది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను అని చిరంజీవి అన్నారు. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సహాయం అందిస్తున్నాను. కానీ నాపై మీరు చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను పెద్దగా ఇస్తున్నది గోరంత మాత్రమే. ఈ విషయం ప్రతీ క్షణం గుర్తు చేస్తుంది. నన్ను బాధ్యతగా నడుచుకొనేలా చేస్తుంది అని చిరంజీవి అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ అంటూ తన అనుభూతిని పంచుకొన్నారు.
Read Also : Balagam Venu Nani నానితో పీరియాడికల్ లవ్ స్టోరీ.. బలగం వేణు అదిరిపోయే ప్లాన్..!