Site icon HashtagU Telugu

Celebrity Cricket League 2023: ఫిబ్రవరి 18 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్..!

CCL

Resizeimagesize (1280 X 720) 11zon

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League) మూడేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. 2019లో చివరిగా సీసీఎల్ టోర్నీ జరిగింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 18న ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పోటీలో మొత్తం ఎనిమిది జట్లు ఉంటాయి. మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు వెళ్లడానికి ముందు మొత్తం 16 గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు ఉంటాయి. టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్‌లో జరగనుంది.

లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 18న హైదరాబాద్‌లో రెండు సెమీఫైనల్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో వరుసగా 1వ, 4వ స్థానాల్లో నిలిచిన జట్లు తొలి సెమీఫైనల్‌లో తలపడగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడతాయి. విజేతలు మార్చి 19న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌లో తలపడతారు. సీసీఎల్‌ 2023 సీజన్‌లో బెంగాల్ టైగర్స్, భోజ్‌పూరీ దబాంగ్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్‌డోజర్స్, కేరళ స్ట్రైయికర్స్, ముంబై హీరోస్, పంజాద్ దే షేర్‌తో పాటు తెలుగు వారియర్స్ జట్లు తలపడనున్నాయి.

Also Read: Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి మహిళల T20 ప్రపంచ కప్.. టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో అంటే..?

సీసీఎల్ 2023 సీజన్ లో తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్ గా అఖిల్ అక్కినేని, కోలీవుడ్ టీమ్ చెన్నై రైనోస్‌కి ఆర్య కెప్టెన్‌గా, పంజాబ్ డి’షేర్ జట్టుకి సోనూ సూద్, ముంబై హీరోస్ కి రితీష్ దేశ్‌ముఖ్, కేరళ స్ట్రైకర్స్ కి కుంచాకో బోబన్, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకి సుదీప్, భోజ్‌పురి దబాంగ్స్ కి మనోజ్ తివారీ, బెంగాల్ టైగర్స్ జట్టుకి జిషు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

ఫిబ్రవరి 18న తమ మొదటి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న చెన్నై రైనోస్ జట్టుతో, మార్చి 4న బెంగాల్ టైగర్స్‌తో, మార్చి 12న పంజాబ్ ది షేర్‌తో తెలుగు వారియర్స్ తన గ్రూప్ మ్యాచులు ఆడనుంది. మార్చి 18న సెమీ ఫైనల్స్, మార్చి 19న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తెలుగు వారియర్స్ జట్టు మూడు సార్లు సీసీఎల్ టైటిల్ గెలిచింది. 2015, 2016, 2017 సీజన్లలో తెలుగు వారియర్స్ టైటిల్ సాధించింది.