Youtuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయి పై పోలీసులకు పిర్యాదు చేసిన యువతీ

Youtuber Harsha Sai : తనను హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని చెప్పి సదరు యువతీ పిర్యాదు లో పేర్కొంది

Published By: HashtagU Telugu Desk
Youtuber Harsha Sai Case

Youtuber Harsha Sai Case

Case Registered Against Youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) పై బిగ్ బాస్ ఫేమ్ యువతీ నార్సింగ్ పోలీసులకు పిర్యాదు (Complaint to Narsing police) చేసింది. తనను హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని చెప్పి సదరు యువతీ పిర్యాదు లో పేర్కొంది. హర్షసాయి తో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ ఫై కూడా ఫిర్యాదులో పేర్కొంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ. 2 కోట్లు తన దగ్గరి నుండి తీసుకుందని ఆమె పేర్కొంది. పిర్యాదు స్వీకరించిన పోలీసులు హర్షసాయి ఫై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు.

ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వారికి సర్‌ప్రైజ్‌గా డబ్బును ఇస్తూ ఓ రేంజ్‌లో పాన్ ఇండియా యూట్యూబర్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. హర్షసాయికి తన వాయిస్ ఎంతో ప్లస్. వీడియోలలో తన వాయిస్‌తో కంటెంట్‌ను పర్‌ఫెక్ట్‌గా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తాడు. ప్రస్తుతం అతని ఆస్తి విలువ రూ.25 కోట్లు నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నెలకు రూ.30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు వినికిడి. ఇటీవల హర్షసాయి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌ తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకీ పెరిగిపోతున్నా వేళా హర్షసాయి ఈ యాప్ లను ప్రోమోట్ చేయడం ఏంటి..? తద్వారా డబ్బు సంపాదించడం ఏంటి అని కూడా విమర్శలు వినిపించాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతనలేని సమాధానాలు హర్ష చెప్పుకొచ్చాడు. పేదలకు సాయం చేయడంలో ముందుండి అందరితోనూ శెభాష్ అనిపించుకున్న హర్షసాయి.. ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం.. అడ్డదిడ్డమైన సమాధానాలను ఇస్తూ.. తాను చేస్తున్న తప్పుని సమర్ధించుకునే ప్రయత్నం చేసి అందరి చేత ఛీ అనిపినిచుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ యువతిని మోసం చేసాడనే ఆరోపణలు బయటకు రావడం తో ఆయన ఫాలోయర్స్ అంత సాయి ఇలాంటి వాడా..? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది..? దీనిపై హర్షసాయి ఏమంటాడు..? సాయి ఫై పిర్యాదు చేసిన సదరు యువతీ ఎవరు..? అనేది చూడాలి.

Read Also :  Home Loans : అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వద్దు – బ్యాంకులకు హైడ్రా సూచన

  Last Updated: 24 Sep 2024, 10:22 PM IST